కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి మెగాలోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా మొదటి అదనపు జడ్జి శ్యామ్ శ్రీ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు లో నిర్వహించిన లోక్ అదాలత్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా 3,048 కేసులు పరిష్కరించారు. విడిపోయిన భార్య, భర్తల రెండు జంటలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఏకం చేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హాన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత , అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.
ఫ జిల్లా మొదటి అదనపు జడ్జి శ్యామ్ శ్రీ
Comments
Please login to add a commentAdd a comment