హుజూర్‌నగర్ : విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. శనివారం హుజూర్‌నగర్‌లోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో నూతన డైట్ మెనూను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలు 200 శాతం పెంచిందన్నారు. రోజూ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి మెనూ అందించాలో నెలవారీ మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం రూ. 300 కోట్లతో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలో మూడు చోట్ల పాఠశాల ఏర్పాటు పనులను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. పదవ తరగతిలో 10బై10 మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందిస్తానని ప్రకటించారు. ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివి అందుకనుగుణంగా ముందుకు సాగాలన్నారు. తొలుత విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వారితో సెల్ఫీలు దిగి ఉత్సాహపరిచారు. అనంతరం గ్రూప్‌ఫొటో దిగారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రెహానా, తహసీల్దార్ మందడి నాగార్జునరెడ్డి, ఏడీఏ రవి నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ అశోక్, జూనియర్ లెక్చరర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment