ఎత్తిపోతల పథకాల్లో పాత సిబ్బందినే కొనసాగిస్తాం
మునగాల: జిల్లా పరిధిలో సాగర్ ఎడమకాలువపై ఉన్న పలు ఎత్తిపోతల పథకాల్లో కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న పాత సిబ్బందినే కొనసాగిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌ను కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లోని ఎత్తిపోతల పథకాల చైర్మన్లు, సిబ్బంది కలిశారు. పాత సిబ్బందిని కొనసాగించాలని కోరారు. స్పందించిన మంత్రి .. అధికారులతో చర్చించి పాత సిబ్బందిలో ఐటీఐ పూర్తిచేసిన వారిని పంపు ఆపరేటర్లుగా ఇతరులను వాచ్‌మెన్, లస్కర్లుగా నియమించాలని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిలకు జీవితాంతం రుణపడి ఉంటామని చైర్మన్లు, సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో ఎత్తిపోతల పథకాల చైర్మన్లు శ్రీరాములు, లింగారెడ్డి,సోమేశ్వరరావు, అంతయ్య, రామిరెడ్డి, సిబ్బంది ప్రసాద్, పి.శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అప్పారావు, కృష్ణయ్య, మహేష్, రాఘవేందర్‌రావు, విష్ణు, వెంకన్న, వెంకటేష్, చలపతి, శ్రీను, నారాయణ, వెంకట్ పాల్గొన్నారు.
ఫ నీటిపారుదల శాఖ
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment