కాంగ్రెస్‌లో జోష్
జిల్లాకు దక్కిన కార్పొరేషన్ పదవులు
ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నేతలకు 2024లో కీలక పదవులు దక్కాయి. టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా పటేల్ రమేష్‌రెడ్డి, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా బండ్రు శోభారాణి, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ముత్తినేని వీరయ్య, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా చెవిటి వెంకన్న యాదవ్, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా గుత్తా అమిత్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నాగరిగారి ప్రీతమ్‌ను నియమించింది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2024 అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్‌లోకి వలసల జోరు పెరిగింది. కీలకమైన డీసీసీబీ, మున్సిపల్ చైర్మన్ స్థానాలను అవిశ్వాసంతో హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ జిల్లాలోని పలు ఎంపీపీ, పీఏసీఎస్ స్థానాలను సైతం చేజిక్కించుకుంది. ప్రస్తుతం మండల పరిషత్‌ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.
సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకున్న కాంగ్రెస్
మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. గతంలో నల్లగొండ ఎంపీగా నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. వారిద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొంది మంత్రులు అయ్యారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. వారిద్దరిని భారీ మెజారిటీతో గెలిపించుకుంది.
నీలగిరి చైర్మన్‌పై అవిశ్వాసంతో మొదలు
కాంగ్రెస్ పార్టీ పలు స్థానిక సంస్థలను క్రమంగా అధీనంలోకి తెచ్చుకుంది. ముఖ్యంగా నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టింది. 2024 జనవరి 8న అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ఫిబ్రవరి 5న చైర్మన్ అయ్యారు. మొదట్లో మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు 22 మంది కౌన్సిలర్లు ఉండగా, ప్రస్తుతం నలుగురే మిగిలారు.
డీసీసీబీ కై వసం..
జిల్లా సహకార బ్యాంకును (డీసీసీబీ) అవిశాస అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న ఆలేరుకు చెందిన గొంగిడి మహేందర్‌రెడ్డిని పదవి నుంచి దించి.. కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి.. జూలై 1న చైర్మన్ అయ్యారు. అదే రోజు బాధ్యతలను స్వీకరించారు.
డీసీఎంఎస్ చైర్మన్ నియామకం..
కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉన్న జిల్లా సహకార, మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ పదవిని కాంగ్రెస్ భర్తీ చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి జగదీశ్‌రెడ్డి సన్నిహితుడిగా ఉన్న వట్టె జానయ్యను డీసీఎంఎస్ చైర్మన్‌ను చేశారు. ఆయన పదవిని కోల్పోయిన తర్వాత వైస్ చైర్మన్‌గా ఉన్న నారాయణరెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. జూలై 19న నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కేతేపల్లి పీఏసీఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
పలు స్థానిక సంస్థలు, పీఏసీఎస్‌లు కై వసం
● నకిరేకల్ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌కు నుంచి కాంగ్రెస్ చేజిక్కించుకుంది.
● తాటికల్లు పీఏసీఎస్ చైర్మన్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ కొత్త చైర్మన్‌ను నియమించింది.
● చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్‌ను అవిశ్వాసంతో కాంగ్రెస్ దక్కించుకుంది.
● కోదాడ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నెగ్గడంతో.. కాంగ్రెస్‌లో చేరిన వారికే ఆ పదవిని అప్పగించారు.
● కోదాడ ఎంపీపీ పదవిని బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ కై వసం చేసుకుంది.
● చిలుకూరు మండలం బేతవోలు, కోదాడ మండలం చిమిరియాల, నడిగూడెం పీఏసీఎస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకుంది.
● హాలియా మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అవిశ్వాసంతోకాంగ్రెస్ కై వసం చేసుకుంది.
● తిరుమలగిరి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు దక్కాయి.
● మోత్కూరు మున్సిపల్ చైర్మన్, నాగార్జున రైతు సేవా సహకార సంఘం, అడ్డగూడురు పీఏసీఎస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకుంది.
● భువనగిరి మున్సిపాలిటీలో 2023 డిసెంబర్ కాంగ్రెస్, బీజేపీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టి ఆ పదవులను రెండు పార్టీలు చెరొకటి దక్కించుకున్నాయి.
● నెరేడుగొమ్ము ఎంపీపీ పదవిని కాంగ్రెస్ దక్కించుకుంది.
● రామన్నపేట ఎంపీపీపై అవిశ్వాసం ప్రకటించడంతో రాజీనామా చేసిన కారణంగా కొత్త ఎంపీపీని కాంగ్రెస్ ఎన్నుకుంది.
● నేరేడుచర్ల చైర్మన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకుంది.
2024లో ఉమ్మడి జిల్లాలో ఆధిక్యం చూపిన ‘హస్తం’ పార్టీ
రెండు ఎంపీ స్థానాల్లోనూ కాంగ్రెస్ జెండా
ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు
అవిశ్వాసంతో డీసీసీబీ, పలు మున్సిపాలిటీలు, ఎంపీపీ పీఠాలు, పీఏసీఎస్‌లు కై వసం
జిల్లా నేతలకు దక్కిన రాష్ట్ర స్థాయి
కార్పొరేషన్ పదవులు
పొలిటికల్
Comments
Please login to add a commentAdd a comment