క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతిఒక్కరు క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. గోవర్ధన్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన క్రీడాపోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసంతోపాటు, శరీర దారుఢ్యం పెంపొందుతుందన్నారు. ఈ సందర్భంగా క్యారం, ముగ్గులు, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శ్యామ్ శ్రీ, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాసరి మధు, ప్రధాన కార్యదర్శి బ్రహ్మారెడ్డి, వెంకట్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీకాంత్, శ్రీకాంత్ రెడ్డి, సైదానాయక్, ఉమ, సుభాస్‌చంద్రబోస్, న్యాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోవర్ధన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment