నా పేరు మారింది..!
అలా
ట్రెండింగ్‌లో సవదీక సాంగ్
తమిళ సినిమా: స్టార్ నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాలలో విడాముయర్చి ఒకటి. నటి త్రిష నైతిక నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు అర్జున్, రెజీనా, సందీప్ కిషన్, ఆరవ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సుదీర్ఘ కాలం జరుపుకొని ఎట్టకేలకు ఇటీవలే పూర్తి చేసుకుంది. చిత్రాన్ని 2025 జనవరిలో పొంగల్ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా పొంగల్‌కు విడుదలవుతున్న చిత్రాలలో భారీ అంచనాలు కలిగిన చిత్రం ఇదే అవుతుంది. ఇందులో నటుడు అజిత్ రెండు గతంలో కనిపిస్తున్నారు. అందులో ఒకటి సాల్టన్ పేపర్ మరొకటి యూత్ ఫుల్ గెటప్ కావడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇకపోతే ఈ చిత్రంలోని సవదీక అనే పల్లవితో సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. అనిరుధ్ బాణీలు కట్టి గాయకుడు ఆంథోనీ దాస్‌తో కలిసి పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ పాటను ఇప్పటికే 37 లక్షల వ్యూస్‌ను అధిగమించి నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా పేర్కొన్నారు. పక్క కమర్షియల్ అంచెలతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన విడాముయర్చి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే ధీమాను యూనిట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కాగా నటుడు అజిత్ ప్రస్తుతం తాను నటిస్తున్న తదుపరి చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment