ఘాట్ రోడ్డులో రక్షణ గోడను ఢీకొన్న కారు
తిరుమల : టీటీడీ ధర్మరథం బస్సును చోరీచేసిన నిందితుడు విష్ణు (19)ని తిరుమల క్రైమ్ పోలీసులు ఆదివారం తమిళనాడులోని చైన్నెలో పట్టుకున్నారు. నిందితుడు ఈ నెల 24వ తేదీ ఉదయం 5.30 గంటలకు తిరుమల నుంచి టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేసి నాయుడుపేట హైవేలో వదిలి పారిపోయాడు. దీంతో తిరుమల క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆ బృందాలకు పట్టుబడ్డారు. నిందితుడిపై పోలీసులు రూ.10వేలు రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
ఘాట్‌రోడ్డులో
రెండు ప్రమాదాలు
తిరుమల: తిరుమల మొదటిఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సు సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డు లోని అక్కగార్లగుడి సమీపంలో బస్సు నిలిచిపోయిన వెంటనే సమాచారం అందుకున్న సాంకేతిక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. బస్సుకు సరిపడా చార్జింగ్ లేదని గుర్తించారు. అందులోని ప్రయాణికులను మరో బస్సులో తిరుపతికి తరలించారు. అనంతరం చార్జింగ్ చేసి బస్సును నడిపించారు.
రక్షణ గోడను ఢీకొన్న కారు
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి వెళుతుండగా వినాయకస్వామి ఆలయానికి సమీపంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో పక్కనే ఉన్న రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో భక్తులు తృటిలో తప్పించుకున్నారు. అయితే ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ట్రాఫిక్ పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment