విశ్వం విద్యాసంస్థకు జాతీయ అవార్డు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థకు ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది ఇయర్–2024 జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును బెంగళూరులో ప్రముఖ బాలీవుడ్ నటి అదా శర్మ చేతుల మీదుగా ఆ విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్‌రెడ్డి అందుకున్నారు. గత 34ఏళ్లుగా స్కూల్ సిలబస్‌తో పాటు సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్స్ వంటి పోటీ పరీక్షలకు ఉత్తమ శిక్షణ అందిస్తూ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నందుకు మై బ్రాండ్ బెటర్ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు విశ్వచందన్‌రెడ్డి తెలిపారు.
బీఫార్మసీ కౌన్సెలింగ్ చేపట్టాలి
తిరుపతి కల్చరల్: రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే బీ–ఫార్మసీ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 135 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయని, అయితే 90 కళాశాలలకు మాత్రమే జీఓ విడుదల చేసి, కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించలేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బీ–ఫార్మసీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌కు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులను సమీకరించి మంత్రి నారా లోకేష్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆంధ్ర విద్యార్థి సంఘ నేతలు మనోజ్‌కుమార్, శేషు, దివాకర్‌రెడ్డి, మునికుమార్, గౌతమ్, సాయిప్రకాష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment