ఉమ్మడి చిత్తూరు జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్‌గా పెద్దిర
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్‌గా ఉన్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గరురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డికి రీజనల్ కో–ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొంది.
పాఠశాల విద్య బలోపేతం
రామచంద్రాపురం: పాఠశాల విద్య బలోపేతం చేయడానికే ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య జోన్–4 రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్యామ్యూల్ స్పష్టం చేశారు. ఈ నెల 18 నుంచి మెడ్‌జీ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో జరుగుతున్న స్కూల్ లీడర్‌షిప్ శిక్షణ తరగతులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెంచాలని సూచించారు. తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన 200 మంది స్కూల్ హెడ్స్‌కు ఈ శిక్షణ అందిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్.కుమార్, రాష్ట్ర పరిశీలకులు అమ్మినాయుడు, తిరుపతి జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శివశంకరయ్య, అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మధు, చంద్రగిరి ఎంఈఓ భాస్కర్‌బాబు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పోలీస్ డ్యూటీ మీట్
చంద్రగిరి: కల్యాణీ డ్యాం సమీపంలోని పోలీసు ట్రైనింగ్ కళాశాల(పీటీసీ)లో వార్షిక పోలీస్ డ్యూటీ మీట్‌ను గురువారం నిర్వహించారు. ప్రిన్సిపల్ సుబ్రమణ్యం జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సిబ్బందికి వాలీబాల్, షటిల్, షార్ట్‌పుట్, జావెలిన్ త్రో ఆటల పోటీలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment