10 నుంచి టెన్నిస్ డబుల్స్ టోర్నీ
తిరుపతి ఎడ్యుకేషన్: ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్, టౌన్ క్లబ్‌లలో సనాల నాగముని మెమోరియల్ టెన్నిస్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్టు క్రీడా భారతి అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి దండు రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు 40 నుంచి 70ఏళ్ల పైబడ్డ రాయలసీమ జిల్లాలతో పాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. 40 ప్లస్, 50ప్లస్, 60ప్లస్, 70ప్లస్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని, ప్రతి విభాగంలో విన్నర్స్ కు రూ.5వేలు, రన్నర్స్‌కు రూ.3వేలతో పాటు ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్టు తెలియజేశారు. ఇతర వివరాలకు 94911 45556, 94402 45980, 94412 96125 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
ముక్కంటి హుండీ ఆదాయం
రూ.1.76 కోట్లు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.1,76,75,333 వచ్చింది. ఆలయంలోని గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద హుండీ లెక్కింపు నిర్వహించారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా బంగారం 73 గ్రాములు, వెండి 478,550 కిలోలు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, ఆలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రమాదంలో యువకుడి మృతి
నాయుడుపేట టౌన్: పట్టణ పరిధిలోని మల్లాం జాతీయ రహదారి కూడలి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. మల్లాం జాతీయ రహదారి కూడలి వద్ద గుర్తుతెలియని యువకుడు రోడ్డు దాటుతుండగా నెల్లూరు నుంచి చైన్నె వైపు వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు స్థానికులు గుర్తించారు. వాహనం టైర్ తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్‌ఐ ఆదిలక్ష్మి పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు. ఢీకొన్న వాహనం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment