తిరుపతి రూరల్: ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా తాగుడికే ఖర్చు చేస్తున్నావని భార్య మందలించడంతో క్షణికావేశంలో ఓ సెంట్రింగ్ మేసీ్త్ర ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలో చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు కథనం..పేరూరు పంచాయతీ ఎన్టీఆర్ కాలనీలో కుప్పాల నందకుమార్(48) భార్యాబిడ్డలతో నివాసం ఉంటున్నాడు. సెంట్రింగ్ మేసీ్త్రగా పనిచేస్తున్న ఆయన శనివారం సాయంత్రం ఇంటికి రావడం, ఆర్థిక లావాదేవీలతో భార్యతో గొడవ పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇంట్లో ఖర్చులకు ఇవ్వకుండా మద్యానికే డబ్బులు తగలేస్తున్నావంటూ భార్య మందలించింది. ఇకనైనా కుటుంబాన్ని పట్టించుకోవాలని హితవు పలికింది. ఇదే విషయాన్ని కుమార్తె కూడా చెప్పడంతో నందకుమార్ క్షణికావేశానికి గురయ్యాడు. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నందకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. సీఐ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment