శ్రీవారి దర్శనానికి 6 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

Published Mon, Jan 6 2025 7:11 AM | Last Updated on Mon, Jan 6 2025 7:11 AM

శ్రీవ

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

మొదటి ఘాట్‌రోడ్డులో ప్రమాదం
తిరుమల నుంచి కిందకు దిగుతుండగా వాహనం బోల్తా పడి నలుగురు గాయపడిన ఘటన వెలుగు చూసింది.
పింఛన్ల కుదింపునకు కూటమి సర్కారు సిద్ధమైంది. పింఛన్లు తీసుకునే లబ్ధిదారులకు వికలాంగత్వాన్ని నిర్ధారిస్తూ గతంలో ప్రభుత్వ వైద్యులు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లలో నకిలీలు ఉన్నాయనే ఉద్దేశంతో పింఛన్ల తనిఖీలు చేస్తున్నామంటూ అధికారులు చెబుతున్నారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కారణం లేకుండా 7,188 మంది పింఛన్లను తగ్గించింది. మరి ఇప్పుడు చేపట్టిన తనిఖీల్లో ఇంకెన్ని పింఛన్లకు కోత వేస్తారోనని పలువురిలో ఆందోళన మొదలైంది.
నేటి నుంచి ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవాలు

సోమవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2025

ఈ ఏడాది జనవరిలో పింఛన్‌ పొందినవారు..

పింఛన్‌ రకం ప్రతి నెలా సంఖ్య

ఇస్తున్న నగదు

అభయహస్తం రూ.5000 6522

అమరావతి ల్యాండ్‌ పూర్‌ రూ.5 వేలు 01

ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్‌ గ్రేడ్‌ 4 రూ.10 వేలు 110

సీకేడీ అంచనా వేసిన జీఎఫ్‌ఆర్‌ రూ.10 వేలు 13

సీకేడీ సీరం క్రియోటినిన్‌ రూ.10 వేలు 05

సీకేడీ చిన్న కాంట్రాక్ట్‌ కిడ్నీ రూ.10 వేలు 11

సీకేడీ ప్రభుత్వం రూ.10 వేలు 174

సీకేడీ ప్రైవేటు రూ.10వేలు 877

డప్పు కళాకారులు రూ.4 వేలు 4,066

వికలాంగులు రూ.6 వేలు 31,153

మత్స్యకారులు రూ.4 వేలు 1802

కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి రూ.10 వేలు 42

మల్టీడిఫార్మిటీ లెప్రసీ రూ.6వేలు 500

వృద్ధులు రూ.4 వేలు 1,32,889

పక్షవాతంతో మంచానికే పరిమితం రూ.15 వేలు 643

కళాకారులు రూ.4 వేలు 109

సైనిక సంక్షేమ రూ.5 వేలు 15

తీవ్రమైన హిమోఫీలియా రూ.10 వేలు 38

త్రీవమైన ముస్క్యులర్‌ డిస్ట్రోఫీ రూ.15 వేలు 557

సికిల్‌ సెల్‌ వ్యాధి రూ.10 వేలు 17

ఒంటరి మహిళ రూ.4 వేలు 6318

తలసేమియా రూ.10 వేలు 34

కల్లుగీత కార్మికులు రూ.4వేలు 1359

చెప్పులు కుట్టేవారు రూ.4 వేలు 880

ట్రాన్స్‌జెండర్‌ రూ.4 వేలు 65

నేత కార్మికులు రూ.4వేలు 5454

వితంతువులు రూ.4వేలు 70341

తిరుపతి అర్బన్‌: జిల్లావ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్ల తనిఖీకి అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ జరిగే తనిఖీలకు నెల్లూరు జిల్లా నుంచి 10 డాక్టర్లను, అన్నమయ్య జిల్లా నుంచి నలుగురు డాక్టర్లను నియమించారు. వీరు రూ.15 వేలు పింఛన్‌ తీసుకుంటున్న 1199 మందిని వారి ఇళ్ల వద్దకే వెళ్లి తనిఖీ చేయనున్నారు.

జిల్లాలో ఏడు బృందాలు..

జిల్లాలో ఏడు బృందాలు నేటి నుంచి తనిఖీలు చేయనున్నారు. ఒక్కో బృందంలో పక్కా జిల్లాలకు చెందిన ఇద్దరు వైద్యులు, తిరుపతి జిల్లాకు చెందిన ఓ పీహెచ్‌సీ వైద్యుడు, సచివాలయంలోని డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉంటారు. అంటే ఒక తనిఖీ బృందంలో నలుగురు ఉంటారు. అదనంగా సెక్యూరిటీ ఉంటారు. వారంలో మూడు రోజులు మాత్రమే తనిఖీలు చేస్తారు. మిగిలిన మూడు రోజులు వారి రోజువారీ డ్యూటీలకు వెళ్తారు.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి వరకు 71,990 మంది స్వామివారిని దర్శించుకోగా 21,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.26 కోట్లు సమర్పించారు. టైం స్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

నేటి నుంచి జిల్లాలో పింఛన్ల తనిఖీ

సిద్ధమైన అధికార యంత్రాంగం

తొలి విడతలో రూ.15 వేలు తీసుకునే 1,199 పింఛన్ల పరిశీలన

గతంలో జారీ చేసిన సదరం సర్టిఫికెట్లలో నకిలీలు ఉన్నాయంటున్న అధికారులు

ఇప్పటికే ఏ కారణం లేకుండా

తొలగించిన పింఛన్లు 7188

ఇప్పుడు తనిఖీల పేరిట కోత పడేదెన్నో..!

ఒక్కో బృందంలో ముగ్గురు వైద్యులు,

ఒక డిజిటల్‌ అసిస్టెంట్‌

ఈ బృందాలకు ఒకరు లేదా

ఇద్దరు కానిస్టేబుళ్లతో భద్రత

మాకు భద్రత కల్పించండి..

మేము ముందే పక్క జిల్లాల నుంచి వస్తున్నాం.. వారి పింఛన్లకు భంగం కలుగుతుందని తమపై ద్వేషం పెంచుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని తనిఖీకి నియమించిన డాక్టర్లు జిల్లా కలెక్టర్‌ను కోరారు. దీంతో ఒక్కో బృందానికి ఒకరు లేదా ఇద్దరు పోలీసులను ఏర్పాటు చేస్తున్నారు. తనిఖీల బృందాలతోనే పోలీసులు ఉంటారు.

జిల్లాలో 2,63,995 పింఛన్లు ..

జిల్లాలో 27 రకాలకు చెందిన పింఛన్లు ప్రతి నెలా 2,63,995 మంది పొందుతున్నారు. అయితే తనిఖీలు పూర్తయిన తర్వాత ఎంతమందిని తొలగిస్తారనే ఆందోళన అందరిలో నెలకొంది. ఇటీవల జిల్లాకు ఒక గ్రామంలో తనిఖీలు అంటూ పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా రేణిగుంట మండలం సూరప్పకశంలో చేపట్టిన తనిఖీల్లో 17 మందిని అనర్హులుగా గుర్తించారు. ఈ లెక్క ప్రకారం ఎంతమందికి పింఛన్‌ గండి పడుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు.

పింఛన్‌దారుల్లో టెన్షన్‌.. టెన్షన్‌

ముందు రోగంతో మంచాన పడ్డారు. ఈ క్రమంలో తనిఖీల పేరుతో పింఛన్‌ తీసుకుంటున్న రోగుల వారి సర్టిఫికెట్లను వైద్యులు తనిఖీ చేయనున్నారు. రూ.15 వేలు పింఛన్లు పక్షవాతం, కండరాల సమస్యతో మంచానికే పరిమితమైనవారిని నేరుగా కలిసి పరిశీలిస్తారు. వచ్చే నెల ఫిబ్రవరిలో విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక రోగులు, కళాకారులు, మార్చిలో వితంతువులను, ఏప్రిల్‌లో వృద్ధుల పింఛన్లను పరిశీలన చేయనున్నారు. అయితే తమ అర్హతను పరిశీలిస్తే ఇబ్బంది లేదని, పార్టీలను అంటగట్టి రాజకీయ రంగుపూస్తేనే ఇబ్బంది వస్తుందని పింఛన్‌దారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శ్రీవారి దర్శనానికి 6 గంటలు1
1/2

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

శ్రీవారి దర్శనానికి 6 గంటలు2
2/2

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement