నేటి నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ
తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) 2025–26 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన ఆర్థిక అవశ్యకత, విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై ఈనెల 7 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం, బుధవారం విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లోనూ, 10వ తేదీన కర్నూలులోని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ మూడు రోజుల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నేరు గాను, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వినియోగదారులు, తమ సూచనలు, అభ్యంతరాలను వెల్లడించవచ్చని తెలిపారు. ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు తమకు సమీపంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు నుంచి పాల్గొని, టారిఫ్ ప్రతిపాదనలపై సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను తెలియజేయాలని ప్రకటనలో కోరారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 69 ఫిర్యాదులు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలు మూలల నుంచి మొత్తం 69 ఫిర్యా దులు అందినట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment