● శ్రీకాళహస్తి సమీపంలో చిన్నతరహా పరిశ్రమ ఏర్పాటుకు ఓ యువకుడు ముందుకొచ్చాడు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుని, విద్యుత్ కనెక్షన్ కోసం 2022 ఆగస్టు 16న ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రూ.93,482 చెల్లించాలని ఎస్టిమేషన వేశారు. అందులో రూ.22,672 దరఖాస్తుదారుడు చెల్లించాడు. అయితే ఇంత వరకు విద్యుత్ కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. విద్యుద్దీకరణ పనులు ప్రారంభించనేలేదు. అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు.
● సత్యవేడుకు సమీపంలో ఓ భారీ పరిశ్రమను స్థాపించేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్త వివిధ రకాల అనుమతులు పొందాడు. విద్యుత్ కనెక్షన్ కోసం 2023 సెప్టెంబర్ 7న ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే ఏడాది డిసెంబర్ 29న డిమాండ్ నోటీసు ఇచ్చారు. డెవలప్‌మెంట్ చార్జీల కింద రూ.9 లక్షలు, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7.50 లక్షలు, సర్వీసు లైన్ చార్జీల కింద రూ.2,17,590 లక్షలు..ఇలా రూ.18,67,590 చెల్లిస్తే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని ట్రాన్స్‌కో అధికారులు డిమాండ్ ఇచ్చారు. ఆ మేరకు అతడు ఆ మొత్తం సొమ్ము చెల్లించారు. కానీ ఇప్పటి వరకు విద్యుత్ కనెక్షన్ మాత్రం మంజూరు చేయలేదు.
● నాయుడుపేటకు సమీపంలో మధ్య తరహా పరిశ్రమ స్థాపనకు శ్రమకోర్చి ఓ యువకుడు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. పరిశ్రమకు సంబంధించి విద్యుత్ కనెక్షన్ కోసం 2017 సెప్టెంబర్ 11న ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో 18న ట్రాన్స్‌కో అధికారులు స్థలాన్ని సందర్శించి, డిమాండ్ నోటీసు ఇచ్చారు. అందులో డెవలప్‌మెంట్ చార్జీల కింద రూ.5,56,800, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.6.96 లక్షలు, ఎస్పీవీ చార్జీల కింద రూ.1,15,960.. మొత్తం రూ.13,68,760 చెల్లించాలని డిమాండ్ నోటీసులు ఇచ్చారు. వాటిని దరఖాస్తుదారుడు 100 శాతం చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment