ముగిసిన ఏటి పండగ ఉత్సవాలు
నాయుడుపేట టౌన్: సంక్రాంతిని పురస్కరించుకుని నాయుడుపేట స్వర్ణముఖి నదీ తీరంలో ఏర్పాటు చేసిన ఏటి పండుగ ఉత్సవాలు శుక్రవారంతో ఆహ్లాదకరంగా ముగిశాయి. ఏటి పండగ చివరి రోజున నాయుడుపేట మండలం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది స్వర్ణముఖి నది వద్దకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, నాయకులు సారథ్యంలో ఉత్సవాలను ఆట్టహాసంగా నిర్వహించినట్టు కమిషనర్ షేక్ ఫజులుల్లా తెలిపారు. ఈ వేడుకల్లో ముస్లింలు సైతం పాల్గొని మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఏటి పండుగ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు విఽశేషంగా ఆకట్టుతున్నాయి. శుక్రవారం రాత్రి నిస్సీ ఈవెంట్ అర్గనైజర్ మేర్లపాక హరి ఆధ్వర్యంలో పలువురు బుల్లి తెర నటులు, యువకులతో చేిసిన నృత్యాలు ఆకర్షణీయంగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment