No Headline
సత్యవేడు నియోజకవర్గం, కేవీబీపురం మండలం, రాగిగుంటకు చెందిన ఓ రైతు పుచ్చ పంట సాగు చేశాడు. చీడపీడలతోపాటు అడవి పందులు, కోతుల బెడద నుంచి పంటను కాపాడుకోవడం తలనొప్పిగా మారింది. కంచె ఏర్పాటు చేసినా.. కరెంటు పెట్టినా మూగ జీవాల ప్రాణాలమీదికి వస్తున్న నేపథ్యంలో కొత్త ఐడియా వేశాడు. ఇంట్లో ఉన్న పాత చీరలను పొలం చుట్టూ రక్షణ కవచంలా కట్టాడు. ఇవి గాలికి అటూఇటూ ఆడుతూ శబ్దం చేయడంతోపాటు.. రకరకాలుగా కనిపిస్తుండడంతో అటువైపు మూగ జీవాలతోపాటు ఎవరూ వెళ్లడం లేదని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఐడియా అదిరింది కదూ..!
– ఫొటో : మోహన్‌కృష్ణ కేతారి, సాక్షి ఫొటో గ్రాఫర్, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment