దిక్కెవరు దేవుడా?
రేణిగుంట మండలం కుక్కలదొడ్డి సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు మృతిచెందగా.. నలుగురు గాయపడ్డారు.
మంగళవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2025
● రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని ప్రైవేట్ ఆస్పత్రికి వారం క్రితం సత్యవేడు నుంచి ఓ రోగి వచ్చాడు. కడుపులో గడ్డ ఉందని, దాన్ని తొలగించాలంటే రూ.30 వేలు అవుతుందని ఆ ఆస్పత్రి యాజమాన్యం తేల్చింది. తీరా ఆపరేషన్ చేశాక రూ.70 వేలు బిల్లు వేశారు. దీనిపై ప్రశ్నించగా ఆపరేషన్ చేశాక ఎక్కువ తీవ్రతగా ఉందని, దానివల్ల ఎక్కువ ఖర్చయిందని మాయమాటలు చెప్పారు. అంత కట్టలేమని తేల్చి చెప్పడంతో రూ.55 వేలు వసూలు చేశారు.
ప్రాణం పోసేది దేవుడైతే.. ఆ ప్రాణాన్ని నిలబెట్టే వైద్యుడ్ని కూడా దేవుడిగానే జనం భావిస్తారు. వారికి సమాజంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. కానీ దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రయివేటు ఆస్పత్రుల యజమానులు ధనపిశాచులుగా మారిపోతున్నారు. ఓపీలు మొదలు వివిధ పరీక్షలు, స్కానింగ్‌లు, మందులు, సూదుల పేరుతో పేద రోగులను నిలువుదోపిడీకి గురిచేస్తున్నారు. ఇక కుటుంబం కోసం ప్రాణాలు నిలబెట్టుకునేందుకు చాలా మంది ఇల్లువాకిలి, చివరకు భార్య మెడలోని పుస్తెలనూ తాకట్టు పెట్టి వైద్యం చేయిస్తున్నారు. దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం.. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతోనే ఇలా పిండుకు తింటున్నారని పలువురు రోగులు ఆవేదన చెందుతున్నారు.
తిరుపతి తుడా: జిల్లాలో ప్రయిటు వైద్యుల దోపిడీ ఎక్కువైంది. రోగుల అర్హతలు, హోదాలను బట్టి టెస్ట్‌లు, స్కానింగ్‌లు రాస్తూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఇందులో గ్రామీణ మండల కేంద్రాల్లో ఆర్‌ఎంపీల డాక్టర్ల హవానే ఎక్కువగా ఉంటోంది. వారు వివిధ కార్పొరేట్ ఆస్పత్రులతో మాఫియాగా ఏర్పడి గ్రామీణ ప్రాంత రోగులను లేని రోగం పేరు చెప్పి పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే అదునుగా బడా ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి అందినకాడికి వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ, వ్యాధి నిర్ధారణ, మందుల విషయంలో వైద్య ఆరోగ్యశాఖకు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ మాఫియా మరింతగా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో అడిగినంత ఇచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతోంది.
మెడికల్ సిండికేట్
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు స్థానికంగా అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకి వెళతారు. ఆ తర్వాత అక్కడ ఆయన సిఫార్సు మేరకు తిరుపతి నగరంలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు పెడతారు. అప్పో సప్పో చేసి ఇక్కడికి వచ్చిన రోగి నుంచి రక్తం తాగినట్లు డబ్బును వసూలు చేస్తారు. ప్రైవేట్ ఆస్పత్రికి సిఫార్సు చేసిన ఆర్‌ఎంపీ వైద్యుడికి మామూళ్లు ఉంటాయి.
నిలువు దోపిడీ
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ప్రైవేట్ ఆస్పత్రులు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వాటిని అతిక్రమిస్తే శాఖాభారమైన తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో సిటిజన్ చార్ట్ తప్పనిసరి ఉండాలి. వైద్యుడి ఓపీ ఫీజు, ఐసీయూ ఫీజు, ల్యాబ్ లలో ప్రతి పరీక్షకు సంబంధించిన ధరల పట్టిక డిస్ప్లే చేయాలి.. ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్‌కు సంబంధించిన ధరల వివరాలను కచ్చితంగా రోగులకు కనిపించేలా పెట్టాలి. ఎన్టీఆర్ వైద్య సేవలు పొందే రోగుల నుంచి వైద్య పరీక్షలు, ఎంఆర్‌ఐ, సిటీ వంటి వాటికి ఎలాంటి ఫీజు వసూలు చేయరాదు. వైద్యాన్ని సేవా దృక్పథంతో అందించాలి.
– డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, తిరుపతి
పీల్చేస్తున్నారు
ఇటీవల నాకు వైరల్ జ్వరం వచ్చింది. నా కుటుంబ సభ్యులు గూడూరులోని ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద చూపించారు. రెండు రోజులు అతని వద్దనే ఉంచారు. సైలెన్లు పెట్టి జ్వరం తగ్గించారు. ఇంటికి వచ్చాక మరుసటి రోజు మరళా జ్వరం వచ్చింది. తర్వాత ఆ ఆర్‌ఎంపీ పలు రకాల పరీక్షలకు రాసి ఇచ్చాడు. దానికే తడిసిమోపుడైంది. మందులు, మాత్రలు రాసిచ్చారు. మళ్లీ ఐదు రోజుల తర్వాత జ్వరం తిరగబెట్టింది. మరోసారి వైద్యుని వద్దకు వెళ్లగా నెల్లూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికెళ్తే వారం రోజులు పెట్టుకుని రూ.50 వేలు గుంజుకున్నారు.
– వసంతమ్మ, గొల్లపాళెం, వాకాడు మండలం
●
వైద్యం సేవా భవంతో కూడుకున్నది. అయితే ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం సేవా భావంతో వైద్యాన్ని అందించే వైద్యులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. రోగుల దోపిడీయే లక్ష్యంగా అత్యధిక ప్రైవేట్ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. ఏదో ఒక రూపంలో రోగి నుంచి ఎంతవరకు రాబట్టొచ్చు అన్నదే అజెండాగా పెట్టుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కి రూపాయి డాక్టర్‌గా పేరు ఉంది. అలానే 25 ఏళ్ల క్రితం తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, పాకాల దామలచెరువు వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఫ్రీ సర్వీస్ వైద్యులు ఉండేవాళ్లు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసం వెదికినా కనిపించరు.
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు
టెస్టులు, మెడిసిన్ పేరుతో నిలువుదోపిడీ
కమీషన్ల కోసం ఇష్టారాజ్యంగా స్కానింగ్‌లకు సిఫార్సు
సేవా భావాన్ని విస్మరించిన వైద్యులు
అప్పుల పాలవుతున్న పేద, బడుగు, బలహీన వర్గాలు
‘ప్రైవేటు‘పై నియంత్రణలేనివైద్యఆరోగ్యశాఖ
స్కానింగ్‌కు
పంపిస్తే
30 శాతం
సేవా భావాన్ని విస్మరించి .. కాసులకు కక్కుర్తిపడి!
తిరుపతి నగరంలో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు వీటితో కుమ్ముకై ఇష్టా రాజ్యంగా సిటీ స్కానింగ్, ఎమ్మార్‌ఐ లాంటి టెస్టులకు సిఫార్సు చేస్తున్నారు. తాము చెప్పిన స్కానింగ్ సెంటర్‌కి వెళ్లాలని రోగులకు ఆస్పత్రి యాజమాన్యం హుకుం జారీచేస్తోంది. అలా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లిన రోగి నుంచి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో ఆ స్కానింగ్ సెంటర్‌కు సిఫార్సు చేసిన వైద్యుడికి 30 శాతం వాటా పంపుతున్నారు. ఈ వాటాలకు కక్కుర్తి పడి కొన్ని ఆస్పత్రులు ఇష్టా రాజ్యాంగ రక్త పరీక్షలు, స్కానింగ్‌లకు పంపిస్తున్నారు. అవసరమున్నా లేకున్నా రక్త పరీక్షలు, స్కానింగ్‌లకు రెకమెండ్ చేయడం వెనుక మాఫియా రింగ్ ఉందన్నది జగమెరిగిన సత్యం.
అనారోగ్య సమస్యతో ఆస్పత్రులకు వచ్చే రోగులను మెడికల్ మాఫియా నిలువు దోపిడీ చేస్తోంది. సమస్యను తీవ్రం చేసి చెప్పడంతో ప్రాణభయంతో చేసేది లేక లక్షలాది రూపాయలను ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రోగి డాక్టర్ వద్దకు వెళ్లాలంటే వసూలు చేసే ఫీజును రూ.400 నుంచి రూ.800 వరకు పెంచేశారు. గతంలో ఒక రూపాయి డాక్టర్‌గా రూ.10 డాక్టర్లుగా చలామణి అయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోగి ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి మానవతా దృక్పథంతో ఆదుకునే వారు కరువయ్యారు. ఓపీ చూపించుకున్న తర్వాత వివిధ అనారోగ్య సమస్యలు ఉండొచ్చేమోనని రోగులను అనుమానంలోకి నెట్టి పలు రకాల రక్త పరీక్షలు, స్కానింగ్ లు, ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్‌లకు సిఫార్సు చేస్తున్నారు. సాధారణ జ్వరం, కడుపునొప్పి అని వచ్చిన రోగులకు రూ.10 వేల వరకు వసూలు చేసి పంపిచేస్తున్నారు. వీటిపై సరైన నియంత్రణ లేకపోవడంతోనే విచ్చలవిడిగా రోగుల నుంచి వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment