తిరుపతి అర్బన్: జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం నుంచి నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఆ మేరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మూడు సెంటర్లలో 1,242 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో పరీక్షలు ఆన్‌లైన్‌లో ఉంటాయని స్పష్టం చేశారు. అయితే 22, 23, 24, 28, 29 తేదీల్లో మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు. 30వ తేదీ మాత్రం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఉంటుందని ఆయన వివరించారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్షా కేంద్రాల వద్ద ఉండాలని, మధ్యాహ్నం 2.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. పరీక్ష రోజుల్లో రైల్వే, బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. అయాన్ డిజిటల్ జూపార్క్, చెర్లోపల్లి సెంటర్‌లో 928 మంది, ఆయాన్ డిజిటల్ జూపార్స్ కేఎంఎం రామిరెడ్డి గారి పల్లి చంద్రగిరి సెంటర్‌లో 229 మంది, ఎన్‌బికేఆర్ సైన్స్ అడ్ ఆర్ట్ కాలేజ్, విద్యానగర్ కోట మండలంలోని సెంటర్‌లో 85 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment