అకాల వర్షం.. రైతుకు నష్టం
వరదయ్యపాళెం: అకాల వర్షం రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. వరదయ్యపాళెం మండలంలో పలుచోట్ల పంట చేతికొచ్చే సమయంలో రెండు రోజుల పాటు కురిసిన వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీంతో కొన్నిచోట్ల కోతలు కోసి రాసులు పోసిన వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. మరికొన్నిచోట్ల వరికోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకొరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్‌లో వర్షాలు పడడంతో రైతులకు తీవ్ర నష్టం కలిగిందని పలువురు వాపోతున్నారు. మండలంలో ప్రధానంగా పెద్ద పాండూరు, రాచర్ల, మత్తేరిమిట్ట, సీఎల్‌ఎన్‌పల్లి, ముస్లింపాళెం, కడూరు, కాంబాకం, వెంగారెడ్డికండ్రిగ, చిన్న పాండూరు ప్రాంతాల్లో వరి పంట నష్టపోయినట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment