![అర్జీ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/4/0000634455-000001-kdpadsalesspo_mr-1738610699-0.jpg.webp?itok=9XGunk6L)
అర్జీలకు పరిష్కారం చూపండి
తిరుపతి అర్బన్: అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కలెక్టర్‌తోపాటు జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 220 అర్జీలు వచ్చాయి. అందులో 116 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం నుంచి మండల కార్యాలయాలు, డివిజన్ కార్యాలయాల పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను అక్కడే పరిష్కరించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
![అర్జీలకు పరిష్కారం చూపండి
1](https://www.sakshi.com/gallery_images/2025/02/4/03tpl50-300079_mr-1738610699-1.jpg)
అర్జీలకు పరిష్కారం చూపండి
Comments
Please login to add a commentAdd a comment