రూ.120 కోట్లతో కోట్‌పల్లి ఆధునీకరణ
● స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ● మండలంలో పలు అభివృద్ధిపనులు ప్రారంభోత్సవం
ధారూరు: జిల్లాలోని ఏకై క మధ్యతరహా ప్రాజెక్టు కోట్‌పల్లి ఆధునీకరణకు రూ.120 కోట్లు మంజూరు చేయించినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలి పారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టులో గంపెడు మన్ను కూడా తీయలేదని ఆరోపించారు. ప్రస్తుత నిధులతో ప్రాజెక్టు, కాలువలను ఆధునీకరించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం మండలంలోని కుక్కింద, ఏఎంసీ మార్కెట్, స్టేషన్‌ధారూరు, దో ర్నాల్, నాగారం, తరిగోపుల గ్రామాల్లో సీసీ రోడ్లు, నాగారంలో పల్లె దవాఖానాను ప్రారంభించారు. ధారూరు సీ్త్రశక్తి భవన్‌లో 36 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు అందేలా చూస్తామన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ధారూరు ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్లు విజయభాస్కర్‌రెడ్డి, అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్, ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి మల్లేశం, తహసీల్దార్ సాజిదాబేగం, పంచాయతీరాజ్ ఈఈ ఉమేశ్, డీఈ శ్రీనివాస్, జెడ్పీ టీసీ మాజీ సభ్యుడు రాములు, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు బసప్ప పాల్గొన్నారు.
దైవభక్తి అలవర్చుకోవాలి
మర్పల్లి: ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని బూచన్‌పల్లిలో గ్రామ దేవతల బోనాల ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశా రు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గూడెం రాములు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్, పార్టీ మండల అధ్యక్షుడు సురేష్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలి
అనంతగిరి: రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అందరూ సహకరించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్వాసితులతో శనివారం తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టం జరగకుండా పరిహారం అందేలా చూస్తామన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా బ్రిడ్జి నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. నిర్వాసితుల త్యాగం వెల కట్టలేమని, మీ బాధను అర్థం చేసుకుని అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment