పారిశ్రామికవాడ రైతులతో చర్చలు
● కలెక్టర్ అధ్యక్షతన సమావేశం
అనంతగిరి: మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం అసైన్డ్ భూములకు సంబంధించి దుద్యాల్ మండలం పోలేపల్లి రైతులతో శనివారం కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్చలు జరిపారు. గత ఏడాది నవంబర్ 29న జారీ చేసిన భూ సేకరణ నోటిఫికేషన్‌లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో 34 మంది రైతులు పాల్గొన్నారు. గ్రామంలోని 73.39 ఎకరాల భూమికి సంబంధించి రైతుల నుంచి సమ్మతి పొందినట్లు తెలిపారు. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం, 150 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, టీజీఐసీ జోనల్ మేనేజర్ శైలజ, అసిస్టెంట్ జోనల్ మేనేజర్ అజీమ సుల్తానా, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రామ్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, దుద్యాల్ తహసీల్దార్ కిషన్ పాల్గొన్నారు.
నివేదికలు రూపొందించాలి
అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పై పథకాల అమలుకు సంబంధించి ఆదివారం మధ్యాహ్నంలోపు నివేదికలు రూపొందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, డీపీఓ జయసుధ, డీసీఎస్‌ఓ మోహన్‌బాబు, వ్యవసాయ శాఖ ఏడీఏ స్వరూప రాణి, హౌసింగ్ పీడీ కృష్ణయ్య, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment