పారిశ్రామికవాడకు మహిళా రైతు ఓకే ● భూమి ఇచ్చేందుకు సుము
దుద్యాల్: మండలంలోని లగచర్ల గ్రామానికి చెందిన ఈర్లపల్లి అంజిలమ్మ అనే మహిళా రైతు పారిశ్రామిక వాడకు భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని శనివారం తహసీల్దార్ కిషన్‌కు అందజేశింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. లగచర్ల గ్రామ సర్వే నంబర్ 102లో తన కు 22 గుంటలు భూమి ఉందని తెలిపారు. పా రిశ్రామిక వాడ ఏర్పాటులో నా భూమి కూడా పోతుందని అధికారులు తెలిపారని.. దీంతో తానే స్వయంగా తహసీల్దార్‌ను కలిసి భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపి అంగీకార పత్రం అందింజేశినట్లు వివరించారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్య దర్శి వెంకటయ్య, మాజీ సర్పంచ్ ఖాజా, గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ తదితరులు ఉన్నారు.
‘ఓరియంటేషన్’ను
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి
అనంతగిరి: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే ఓరియంటేషన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌లోని కోర్టు ఆవరణలో శనివారం జిల్లాలోని పారా లీగల్ వలంటీర్లు, న్యాయ విద్యార్థులు, న్యాయసేవా ప్యానల్ న్యాయవాదులకు రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో పిల్లలపైన జరుగుతున్న అఘాయిత్యాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్, జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, ప్రిన్సిపల్ జూనియర్ న్యాయమూర్తి శ్రీకాంత్, అదనపు జూనియర్ న్యాయమూర్తి శృతిదూత, లీగల్ ఎడ్ న్యాయవాదులు వెంకటేష్, రాము, శ్రీనివాస్, న్యాయవాదులు బాలయ్య, నాగరాజు, నర్సింలు, యాదగిరి, పారలీగల్ వలంటీర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి ఘనత
బీఆర్‌ఎస్‌దే
మాజీ మంత్రి మహమూద్ అలీ
కొత్తూరు: షాద్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చకు రావాలని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ సవాల్ విసిరారు. జేపీదర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఆయన శనివారం మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దర్గా అభివృద్ధి కోసం అప్పట్లో సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. మాస్టర్‌ప్లాన్ అమలుతో స్థానికులు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలనే ఆలోచనతో పనులు చేపట్టడానికి కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. ఈ విషయాలు తెలియనికాంగ్రెస్ నేతలు దర్గా అభివృద్ధిని బీఆర్‌ఎస్ నాయకులు పట్టించుకోలేదని ఆరోపించడం సరికాదన్నారు. 60 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిఏడాది గడుస్తున్నా ఎందుకు అభివృద్ధి పనులు చేపట్టడం లేదని నిలదీశారు. బీఆర్‌ఎస్ హయాంలో దర్గా అభివృద్ధి కోసం కేటాయించిన రూ.50 కోట్ల నిధులు ఇప్పటికీ మైనార్టీ కార్పొరేషన్‌లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావులపై కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా పెడుతున్న కేసుల నుంచి వారికి న్యాయం జరగాలని ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ నస్రుల్లాఖాన్, రాంబాల్‌నాయక్, మిట్టునాయక్, సత్యనారాయణ, దేవేందర్‌యాదవ్, యాదగిరి, కె.శ్రీనివాస్ గౌడ్, గోపాల్‌నాయక్, అజయ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్‌కు అంగీకార పత్రం ఇస్తున్న మహిళా రైతు అంజిలమ్మ
Comments
Please login to add a commentAdd a comment