ఇబ్రహీంపట్నం: సీపీఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో మహాసభల వాల్ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలు ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో జరుగుతాయని తెలిపారు. ఈ మహాసభల్లో మూడేళ్లలో ప్రజా సమస్యలపై పార్టీ చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను బేరీజు వేసుకుంటూ, భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమాలకు రూపకల్పన చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవేర్చకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బుగ్గరాములు, చింతపట్ల ఎల్లేష్, ముసలయ్య, చెనమోని శంకర్, విజయ్, ప్రభుదాసు, యాదగిరి, వీరేష్, రాఘవేందర్, రజాక్ పాష పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment