వ్యసనాలకు బానిసలవ్వొద్దు
మంచాల: యువత వ్యసనాలకు బానిసలవ్వొద్దని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి పొన్న శ్రీదేవి అన్నారు. గురువారం మండల పరిధిలోని నోముల సమీపంలోని మహాత్మాజ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్ ఉచ్చులో చిక్కుంటే జీవితం అంధకారమవుతుందన్నారు. చిన్న వయస్సుల్లో యువత డ్రగ్స్ కేసులో జైలు జీవితం గడిపడం బాధాకరమన్నారు. కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కళాశాల నుంచి బహిష్కరణ చేయడమే కాకుంగా రెండేళ్లు జైలు శిక్ష, రూ.పదివేలు జరిమానా విధిస్తామన్నారు. ఈ సందర్భంగా లీగల్ సర్వీస్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సీహెచ్ రవి, ప్రిన్సిపాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీదేవి
Comments
Please login to add a commentAdd a comment