పోలీస్ పహారాలో గ్రామ సభలు
దుద్యాల్: రోటిబండతండా, దుద్యాల్, సంట్రకుంటతండా, హస్నాబాద్, హంసంపల్లిలో శుక్రవారం పోలీసు బందోబస్తు నడుమ గ్రామ సభలు నిర్వహించారు. సుమారు 500 మంది జనాభా కూడా లేని రోటిబండతండాలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ భరత్‌రెడ్డి, ట్రైనీ ఎస్‌ఐలు రాహుల్, మోహన్‌తో పాటు మరో 15 మంది కానిస్టేబుళ్లు సభను పర్యవేక్షించడం చర్చనీయాంశమైంది. లగచర్ల ఘటన కేసులో ఈ గ్రామానికి చెందిన ఐదుగురు జైలుకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ ఉషశ్రీ, ఎంపీఓ మహేశ్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు కృష్ణవేణి, సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, మెరుగు వెంకటయ్య, ఖాలీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment