ప్రాథమిక దశలోనే గుర్తించాలి
అనంతగిరి: సున్నా నుంచి ఆరేళ్ల వయసులోపు పిల్లల్లో వచ్చే లోపాలు, వైకల్యాన్ని ప్రాథమిక దశలో గుర్తించి వైద్యం అందిస్తే మంచి ఫలితం ఉంటుందని అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపర్‌మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటలెక్చువల్ డిజబుటిటీస్ సికింద్రాబాద్ వారి సమన్వయంతో శుక్రవారం వికారాబాద్ డివిజన్ పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లకు స్థానిక మహావీర్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరవణ మాట్లాడుతూ.. 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలలో పెరుగుదల లోపం, వైకల్యాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించాలన్నారు. వారికి సరైన వైద్యం అందిస్తే వైకల్యాన్ని జయించవ్చని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలు విధి నిర్వహణలో ఎంతో దోహదం చేస్తాయన్నారు. అనంతరం ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లకు ఎర్లీ ఇంటర్వెన్షన్ కిట్‌లను అందజేశారు. కార్యక్రమంలో శిక్షకులు డాక్టర్ రుశికేష్ దేశ్‌పాండే, గౌతమ్‌రాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు రవీంద్రయాదవ్, ప్రవీణ్, శ్రీనివాసులు, చండీశ్వరి, రజిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment