సమష్టి కృషితోనే పరిగి అభివృద్ధి
పరిగి: పరిగి మున్సిపాలిటీని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దామని చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్ తెలిపారు. పాలవర్గం పదవీకాలం పూర్తి కావస్తున్న సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పదవీ కాలంలో దాదాపు రూ.48 కోట్లతో వివిధ అభివృద్ధి ప నులు సమర్థవంతంగా పూర్తి చేశాం. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడగానే మొట్టమొదటి పాలకవర్గం పరిగిని అన్ని విధాలా అభివృద్ధి చేసింది. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశాం. మున్సిపాలిటీ ఏర్పాటైన సమయంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని దశలవారీగా పరిష్కరిస్తూ వచ్చాం. అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు వేశాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు ఏర్పాటు చేశాం. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనాకే పోయింది. పట్టణ ప్రజల కోసం సులాబ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేశాం. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అభివృద్ధికి కౌన్సిలర్లు సమష్టిగా కృషి చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా సహకరించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment