తాండూరు మున్సిపల్ కార్యాలయం
తాండూరు: తాండూరు మున్సిపల్ పాలకవర్గ చివరి సమావేశానికి ముహూర్తం ఖరారైంది. నేడు(శనివారం) కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు మూడు నెలలుగా సమా వేశం నిర్వహించాలని కౌన్సిలర్ల నుంచి ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. చైర్‌పర్సన్, కమిషనర్ చాంబర్ తోపాటు కౌన్సిల్ హాల్‌ను రూ.33 లక్షలతో ఆధునీకరణ పనులు జరుగుతుండటంతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల మొదటి వారంలో సమావేశం నిర్వహించేందుకు కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్‌లతో చైర్‌పర్సన్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగాఒక్కో వార్డులో రూ.20 లక్షల నిధులతో అభివృద్ధి చేయాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో నిధులు లేవని భారీ మొత్తంలో కేటాయించలేమంటూ అధికారులు అనడంతో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చివరి సమావేశం పెట్టడం సాఽ ద్యం కాదని అధికారులు చేతులేత్తేశారు. చివరి కౌన్సిలర్ సమావేశం కోసం మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్‌లు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని సంప్రదించారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మున్సిపల్ అధికారులతో మాట్లాడి శనివారం సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వా ర్డుకు రూ.5 లక్షల చొప్పున అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తు ఎజెండాను సిద్ధం చేయా లని కమిషనర్ విక్రంసింహారెడ్డికి సూచించారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సి ల్ సమావేశం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అసెంబ్లీ తరహాలో కొత్త హంగులతో నిర్మించిన కౌన్సిల్ హాల్ కౌన్సిల్ చివరి సమావేశానికి ముస్తాబైంది.
Comments
Please login to add a commentAdd a comment