● 585 జీపీలు, 97 మున్సిపల్ వార్డుల్లో కార్యక్రమాలు ● న
వికారాబాద్: నాలుగు రోజులుగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలు శుక్రవారంతో ముగిశాయి. జిల్లాలోని 585 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లోని 97 వార్డుల్లో సభలు పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలను గ్రామాలు, వార్డుల వారీగా చదివి ప్రజల సమక్షంలో ఆమోదింపజేశారు. అయితే గతంలో పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నా అర్హుల జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని పలు చోట్ల ప్రజలు అధికారులను నిలదీశారు. నాలుగు పథకాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువ అర్జీలు వచ్చాయి.
నిరసనలు.. నిలదీతలు..
ప్రజాపాలన గ్రామ సభల్లో అధికారులు, అధికార పార్టీ నేతలు అనేక చోట్ల నిరసనలు, నిలదీతలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ పేర్లు జాబితాలో రాకపోవటంపై వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులను అర్హుల జాబితాలో చేర్చినప్పటికీ మొదటి విడతలో ఎవరికి ఇస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. రేషన్ కార్డుల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేర్లు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించి జాప్యం చేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఇదే తంతు కొనసాగుతుందా అనే అనుమానం ప్రజల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment