బైక్ ఢీకొని వాచ్‌మెన్ మృతి
యాచారం: బైక్‌ను వెనుక నుంచి మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో వాచ్‌మెన్ అక్కడికక్కడే మృతి చెందాడు. యాచారం సీఐ నర్సింహారావు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని చింతపట్ల గ్రామానికి చెందిన నక్కమల్ల జంగయ్య(52) తక్కళ్లపల్లి సమీపంలోని శ్రావణ పవర్‌ప్లాంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని గురువారం ఉదయం తన స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. ఆయన సాగర్‌రోడ్డుపైకి వచ్చిన వెంటనే వెనుకనుంచి అంతివేగంగా వచ్చిన ద్విచక్రవాహనం జంగయ్య బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జంగయ్య తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఓ కూతురు ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment