ఐక్యతకు ప్రతీక ఉర్సు
షాద్‌నగర్: కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉర్సు ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నేరేళ్ల చెరువులోని దర్గా హజ్రత్ షా మూసా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అల్లా దయ అందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన కోరారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మౌనిక, హరికృష్ణ, పర్వేజ్ హుస్సేన్, అడ్డు, సయ్యద్ అద్నాన్ ఎల్లయ్య, నర్సింలు, సయ్యద్ సాబేర్, సాజిద్, నజీర్, మన్సూర్, జావిద్, జిలానీ, సయ్యద్ ఉస్మాన్, శివాచారి, పవన్ ఠాకూర్, సుధీర్, మధు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment