రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రయ్య
కొడంగల్ రూరల్: సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుస్స చంద్రయ్య కోరారు. గురువారం పట్టణంలోని ఆటోస్టాండులో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతోందన్నారు. ఈ నెల 25న నిర్వహించే బహిరంగసభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజు, మల్లయ్య, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
26న ‘లక్ష డప్పులు’సన్నాహక సదస్సు
యాలాల: జిల్లా కేంద్రంలో ఈ నెల 26న ‘వేయి గొంతులు–లక్ష డప్పులు’ సన్నాహాక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎంఎస్‌పీ(మహాజన సోషలిస్టు పార్టీ) జిల్లా కార్యదర్శి డప్పు మహేందర్, ఎమ్మార్పీఎస్ యాలాల మండల అధ్యక్షుడు మెట్లి సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సన్నాహాక కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లోని మాదిగ, ఉపకులాల ప్రజలు కార్యక్రమానికి భారీగా తరలిరావాలని వారు కోరారు.
పూత రాలకుండా నీరందించాలి
రంగారెడ్డి ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త యమున రెడ్డి
దుద్యాల్: మామిడి రైతులు పూత దశలోనే జాగ్రత్తలు పాటించాలని రంగారెడ్డి ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త యమున రెడ్డి సూచించారు. గురువారం మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలోని రైతు లక్ష్మారెడ్డి మామిడి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం మామిడి చెట్లు పూత దశలో ఉన్నాయి. పిందెలు కాసినన్ని రోజులు పూతను కాపాడుకోవాలని చెప్పారు. పూత రాలకుండా మొక్కకు స్వల్పంగా నీరందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు భీంరెడ్డి, మహిపాల్, వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అనధికారికంగా ‘మీ సేవ’లు
ఆన్‌లైన్ సెంటర్ నిర్వాహకుడిపైతహసీల్దార్‌కు ఫిర్యాదు
కొడంగల్: పట్టణంలోని ఆన్‌లైన్ సెంటర్ నిర్వాహకుడు అనధికారికంగా మీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడని స్థానిక మీ సేవా కేంద్రాల నిర్వాహకులు గురువారం తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకున్నా ఇతర మీ సేవా కేంద్రం ఐడీ నంబర్‌తో కుల, ఆదాయ, స్థానిక ధృవీకరణ పత్రాలు, ఇస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ పత్రాలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు నరేందర్ రావు, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment