బైక్‌ను ఢీకొట్టిన కారు
ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
పరిగి: ద్విచక్రవాహ నాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురు వారం పట్టణ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ సంతోశ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన బాయికాడి చిన్న బుచ్చయ్య(68), ఘనపురం శ్రీనివాస్ పురుగుమందు కొనుగోలుకు పట్టణ కేంద్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు ఇండియన్ ఆయిల్ బంక్‌లోకి వెళ్లారు. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న బుచ్చయ్య, శ్రీనివాస్ గాయాలవ్వడంతో పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను ఈశా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న బుచ్చయ్య మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థి అదృశ్యం
యాచారం: గ్రీన్‌ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. సీఐ కృష్ణం రాజు తెలిపిన ప్రకారం.. నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన గొరిగె భిక్షపతి, పార్వతమ్మ దంపతుల కుమారుడు భానుప్రసాద్ బొంగ్లూరు వద్ద ఉన్న నారాయణ హాస్టల్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు వచ్చిన విద్యార్థి గురువారం మధ్యాహ్నం ఫోన్ ఇంట్లోనే పెట్టి బైక్ తీసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
షాపింగ్ మాల్ ఎదుట కార్మికుల ధర్నా
షాద్‌నగర్: షాపింగ్ మాల్‌లో పని చేసేందుకు బైక్ వస్తున్న కార్మికుల వాహనాలకు భద్రత కల్పించాలని డిమాండ్‌తో గురువారం ధర్నా చేపట్టారు. చందన బ్రదర్స్ షాపింగ్‌మాల్ ఎదుట చేపట్టిన ఈ ధర్నాకు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రాజు మాట్లాడుతూ.. చందన బ్రదర్స్ షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్న ఇద్దరు కార్మికుల బైక్‌లు ఈ నెల 11న చోరీకి గురయ్యాయి. షాపింగ్‌మాల్ యాజమాన్యం సీసీ కెమెరాలు, వాచ్‌మెన్‌ను పెట్టకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని.. చర్యలు తీసుకోవడం లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment