రాజ్యాధికారంతోనే డిమాండ్ల సాధన
షాబాద్: రాజ్యాధికారంతోనే హక్కులు సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అన్నారు. గురువారం మండల పరిధిలోని అప్పారెడ్డిగూడలో బీసీసేన సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ అధ్యక్షుడిగా పత్తి శేఖర్, ఉపాధ్యక్షుడిగా నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కార్యదర్శిగా సాయిరాంగౌడ్, కోశాధికారిగా చంద్రశేఖర్, సలహాదారులుగా శ్రీనివాస్, సభ్యులుగా మహేష్, శ్రీశైలం, శివ, రమేష్, లింగం, మల్లేష్, శ్రీకాంత్, శశికుమార్, మహేందర్‌ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. వచ్చే స్థానిక సంస్ధల ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలన్నారు.
బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment