మణికొండ: హైదరాబాద్ నగర శివారు నార్సింగిలో ఏటా సందడిగా జరిగే పశుసంక్రాంతి జాతరను శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. నిజాం కాలంలో మొదలైన ఒరవడి నేటికీ నిరాటంకంగా కొనసాగుతున్నది. పంటలన్నీ ఇంటికి చేరి అవి అమ్మగా వచ్చిన డబ్బుతో రైతులు సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకొంటారని అందరికీ తెలుసు. మిగిలిన డబ్బుతో తమ పంటలకు తోడుగా పాడిని (పశువులు) కొనుగోలు చేసే సంస్కృతికి చిహ్నంగా నిలిచేదే నార్సింగి పశుసంక్రాంతి. ఒకప్పుడు నార్సింగి కుగ్రామంగా ఉన్న సమయంలో ప్రారంభమైన ఈ సంస్కృతి ప్రస్తుతం మున్సిపాలిటీగా అవతరించి ఎటు చూసినా ఆకాశాన్నంటే టవర్‌లు, అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, కన్వెన్షన్‌లు, ఔటర్ రింగ్ రోడ్డుతో కొత్త హైటెక్ నగరంగా అవతరించినా కొనసాగుతుండటం అందరినీ అబ్బురపరుస్తుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ తరువాత వచ్చే రెండవ శుక్రవారం పశు సంక్రాంతిగా నిర్వహిస్తారు.
● గుజరాత్, హరియాణా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది గేదెలు, ఆవులను వ్యాపారులు, రైతులు ఇక్కడకు తెచ్చి క్రయవిక్రయాలను నిర్వహిస్తుంటారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పశుసంక్రాంతిని ఈ సంవత్సరం శుక్రవారం నిర్వహించేందుకు మార్కె ట్ కమిటీ పాలక కమిటీ ఏర్పాట్లు చేసింది.
● ప్రతి సంవత్సరం నార్సింగి పశు సంక్రాంతికి వచ్చే గేదెలు, ఆవులు రికార్డు ధరలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈసారి పంటలు బాగా పండటం, వరి పంట అధిక దిగుబడి రావటంతో రైతుల వద్ద డబ్బు ఉందని, పంటలకు తోడుగా పశువులను పెంచుకోవాలనే దిశగా రైతులు ఆలోచన చేస్తున్నారని, దాంతో శుక్రవారం జరిగే సంతలో బారీగానే అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుందని పశు వ్యాపారులు పేర్కొన్నారు.
నేడు నార్సింగిలో పశువుల జాతర
నిజాం కాలంలో మొదలైన పశువుల సంత
ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్
జాతరకు ఆవులు, గేదెలను తరలించిన రైతులు
Comments
Please login to add a commentAdd a comment