చెస్‌లో సత్తాచాటుతున్న శివాంశిక
అత్తాపూర్: అత్తాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శివాంశిక చెస్ క్రీడలో సత్తాచాటుతూ ముందుకు సాగుతోంది. ఏపీలోని పెద్దాపూర్‌లో జనవరి 17 నుంచి 21వ వరకు జరిగిన అండర్–15 బాలిక నేషనల్ జాతీయ స్కూల్ చాంపియన్‌షిప్–2025లో తెలంగాణ రాష్ట్రం నుంచి శివాంశిక పాల్గొంది. వివిధ విభాగాలలో 2500 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. వారందరిలో అసాధ్యమైన ర్యాంకులు సాధిస్తూ తనదైన శైలిలో ఎవరు ఊహించని విధంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అంతర్జాతీయ చెస్ రంగంలో ఉన్న చెస్ క్రీడాకారుల ప్రశంసలు, ప్రోత్సాహాన్ని అందుకుంటోంది. పేదరికంలో ఉన్న శివాంశికకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహాన్నిస్తే దేశంలోనే అగ్ర స్థానానికి చేరుకుంటుందని.. మంచి కోచ్‌ను ఏర్పాటుచేస్తే ఉన్నత స్థానాలను తప్పక అధిరోహిస్తుందని మాస్ట్రో చెస్ అకాడమీ అత్తాపూర్ ట్రైనర్ అమిత్ పాల్‌సింగ్ ఈ సందర్భంగా శివాంశికను అభినందించారు. నిర్వాహకురాలు చెస్ క్రీడల్లో రాణించిన శివాంషికను ఘనంగా సత్కరించి ట్రోఫీ, రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. తమ పాఠశాలలో చదువుకుంటూ చెస్‌లో రాణిస్తున్న శివాంశిక తమ పాఠశాల విద్యార్థిని కావడం తమకు ఎంతో సంతోషంతోపాటు గర్వకారణంగా కలిగిస్తుందని రాజేంద్రనగర్ మండల విద్యా శాఖాధికారి (ఎంఈవో) శంకర్‌రాథోడ్, అత్తాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉపాధ్యాయులు సాయిప్రసాద్, గాంగ్యానాయక్ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment