ఆందోళన వద్దు.. అండగా ఉంటాం
నవాబుపేట: సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని మాదిరెడ్డిపల్లి గ్రామసభలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తోందన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో రైతులకు రూ.770 కోట్ల రుణమాఫీ, వికారాబాద్ జిల్లాలో రూ.850 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సాంకేతిక కారణాలతో ఆగిన రుణమాఫీ సైతం త్వరలోనే పూర్తవుతుందన్నారు. నవాబుపేట మండలంలోనే 6,237 మంది రైతులకు రూ.43 కోట్ల రుణమాఫీ అయిందని గుర్తు చేశారు. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనురాధ, తహసీల్దార్ జైరాం, పీఎసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు వెంకటయ్య, ప్రభాకర్, తదితరులు పాల్నొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
మండలి చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య
Comments
Please login to add a commentAdd a comment