ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి మద్దతు ఇద్దాం
కొడంగల్ రూరల్: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న చేపట్టనున్న వేలగొంతులు–లక్ష డప్పులు కార్యక్రమానికి బీసీలుగా మద్దతును ఇద్దామని బీసీ నేత, కవులు, కళాకారుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన సంఘీభావ సభలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణలో మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే మహాప్రదర్శనకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కవి మోహన్‌బైరాగి, బీసీ సేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కన్నోజు వెంకటేశ్వర్లు, ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్‌పల్లి శ్రీనివాస్, గోవర్దన్‌చారి, అంబేడ్కర్ యువజన సంఘం తాలూకా అధ్యక్షుడు రమేష్‌బాబు, శ్రీనివాస్, లక్ష్మప్ప, మల్లేష్ యాదవ్, చిన్నయ్య, లాలప్ప తదితరులు పాల్గొన్నారు.
కవులు, కళాకారుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న
Comments
Please login to add a commentAdd a comment