కొత్తూరు: ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని కొత్తూరు పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. సీఐ నర్సింహారావు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్‌కు చెందిన ఎడ్ల హంసమ్మ ఈ నెల 20న తన కోడలు రాధిక, మనుమడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తుండగా ఈ నెల 22న రాధిక పోలీసుస్టేషన్‌కు చేరుకుని తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు ఎకరా పొలం ఇచ్చారు. గతేడాది ఆగస్టులో తన భర్త శ్రీకాంత్ డెంగీతో చనిపోయాడని.. ఈ క్రమంలో స్టేషన్ తిమ్మాపూర్‌కు చెందిన మహేందర్ శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిన వివరాలు చెబుతానంటూ నమ్మించి ఎకరా పొలానికి సంబంధించిన పట్టాపాస్‌బుక్ తీసుకున్నాడని చెప్పింది. ఈ నెల 20న మహేందర్ తన డ్రైవర్ శేఖర్‌తో కలిసి తిరుపతి తీసుకెళ్లి మార్గమధ్యలో దాడి చేసి బంగారు రింగ్, నగదు తీసుకుని బాండ్ పేపర్లపై సంతకం పెట్టాలని బలవంతం చేశారని వాపోయింది. తిరుపతి నుంచి తిరిగి హైదరాబాద్‌కు తీసుకుకువచ్చి సంతకం పెట్టాలని లేదంటే నిన్ను, కుమారుడిని చంపేస్తామని బెదిరించారని.. వారు మద్యం మత్తులో ఉండగా తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చానని పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మహేందర్, శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఒక చాకు, కారు, రెండు సెల్‌ఫోన్లు, ఉంగరం, కొంతనగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును చేధించిన ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బందిని సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment