రోగులకు మెరుగైన వైద్యం అందాలి
● జాతీయ కుటుంబ సంక్షేమ శాఖసీనియర్ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ మెడోస్
అనంతగిరి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ మెడోస్ వైద్యులకు సూచించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం జిల్లా వైద్యాధికారి వెంకటరమణతో కలిసి వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి వైద్య విద్యార్థులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. అనంతరం పాలిటివ్ కేర్ విభాగాన్ని సందర్శించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ అవసాన దశలో ఉన్న రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. అక్కడి నుంచి మహావీర్ వైద్య కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్లతో మాట్లాడారు. కళాశాలలో రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. టీబీ కేసులకు ఉచితంగా మందులు అందించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను కలిశారు. మూడు రోజుల పర్యవేక్షణలో జిల్లాలో పరిశీలించిన వివిధ అంశాలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment