విశాఖపట్నం: టాయిలెట్ వివాదం ఒక వ్యక్తి మృతికి దారి తీసింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం ఆశవానిపాలెంలో చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్టు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం క్రికెట్ ఆడిన ఆలమూరి కరుణ్‌కుమార్ (28) స్నేహితులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాయిభాను అనే యువకుడు ఆశవానిపాలెం శివారు ప్రాంతంలో టాయ్‌లెట్‌కు వెళ్లాడు. దీనిపై అక్కడున్న తవిటి రాజు, అతని భార్య రాజేశ్వరి, ఆమె తోటి కోడలు లక్ష్మి, రామారావు అతనితో గొడవకు దిగారు. మాటామాటా పెరిగి తోపులాట జరిగింది.
విషయం తెలుసుకుని కరుణ్‌కుమార్ వచ్చి గొడవకు కారణంపై ఆరా తీశాడు. దీంతో నీకేంటి సంబంధమంటూ తవిటి రాజు, రాజేశ్వరి, లక్ష్మి అతడిపై దాడికి పాల్పడ్డారు. కరుణ్‌కుమార్ గుండెలపై కొట్టడంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మరో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో గ్రామానికి తీసుకువచ్చారు. దాడికి పాల్పడిన వారి ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందిన వెంటనే ఎయిర్‌పోర్టు సీఐ బీఎండీ ప్రసాద్, కంచరపాలెం సీఐ నల్లి సాయి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నారు. మృతుడు కరుణ్‌కుమార్ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో కాంట్రాక్టర్ వద్దఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి తల్లితండ్రులు, భార్య, తమ్ముడు ఉన్నారు. మూడేళ్ల క్రితం వివాహం అయింది.
Comments
Please login to add a commentAdd a comment