బొత్స ఝాన్సీకి జ్ఞాపిక అందజేస్తున్న విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు మళ్ల విజయప్రసాద్
మహారాణిపేట : వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొత్స ఝాన్సీని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఝాన్సీకి విజయ ప్రసాద్ జ్ఞాపికను అందజేశారు. ఝాన్సీని కలిసిన వారిలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు పి.వి.సురేష్, ముర్రు వాణి, రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ బాకీ శ్యామ్ కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు దొడ్డి కిరణ్, పి.మల్లేశ్వరరావు, గొర్లె అప్పలస్వామినాయుడు, యల్లపు వెంకటేశ్వరరావు, యర్రబిల్లి ప్రభాకరరావు, అనిల్, శ్యామ్, హనుమంతు అప్పలరాజు, మళ్ల యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment