అపర్ణ
నాట్య మయూరి
కూచిపూడిలో విశేష ప్రతిభ సౌత్ ఇండియా వుమెన్ అచీవర్స్ అవార్డు–2024 కై వసం
అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తున్న ఈ యువతికి చిన్నప్పటి నుంచి కూచిపూడి నృత్యం అంటే పంచప్రాణాలు. సరిగమల పదనిసలతో అడుగులు కలిపింది. లయబద్ధంగా హావభావాలు ప్రదర్శిస్తూ కూచిపూడి నృత్యానికి వన్నె తెస్తోంది. సాధన చేస్తే సాధించలేనిది లేదంటూ నిరూపించింది. ఆదివారం సౌత్ ఇండియా వుమెన్ అచీవర్స్ అవార్డు–2024 కై వసం చేసుకుంది. మధురవాడ పిలకవానిపాలేనికి చెందిన కూచిపూడి కళాకారిణి ఎస్‌ఎస్‌వీ అపర్ణ దినదినప్రవర్థమానంగా వెలుగుతూ జాతీయ స్థాయిలో సత్తాచాటుకుంటోంది.
– మధురవాడ
రాష్ట్ర, జాతీయ స్థాయిలో
500కి పైగా ప్రదర్శనలు
వేదిక ఏదైనా సరే..ఆమె నృత్యానికి పురస్కారా లు, అవార్డులు రావల్సిందే. ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. విశాఖ 104 ఏరియాలోని నేవీ స్కూల్‌లో 11వ తరగతి చదువుతోంది. ఇంతవరకు జిల్లా, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నో అవార్డులు కైవ సం చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సహాయ సహకారాలతో బెంగళూరులో ఆదివారం కియా (కేఈఏ) ప్రభాత్ ఆడిటోరియంలో ట్వెల్ మ్యాగజైన్ సివా (ఎస్‌ఐడబ్ల్యూఏఏ) 2024 పేరుతో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో సౌత్ ఇండియన్ అచీవర్స్ అవార్డు–2024, కూచిపూడి తరంగం మర్కటమణి అవార్డును ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌కు చెందిన నేషనల్ వుమెన్స్ సెల్ అధ్యక్షురాలు రాధ కొల్లి చేతుల మీదుగా అందుకుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సుమన్ తదితరులు చేతులు మీదుగా ప్రశంసాపత్రాలు
అందుకుంది.
కుటుంబ నేపథ్యం
మధురవాడ పిలకవానిపాలేనికి చెందిన శ్రీదేవి, జనార్దనరావు దంపతులకు 2008లో జన్మించిన అపర్ణ తొమ్మిదేళ్ల వయసులోనే కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. అంచెలంచెలుగా ఎదిగింది. ఏడేళ్లు పలువురు నాట్య గురువుల వద్ద శిష్యరికం చేసింది. తల్లి ప్రోత్సాహంతో నృత్యంలో విశేషంగా రాణిస్తోంది. కరాటే, స్కేటింగ్, స్మిమ్మింగ్ వంటి వాటిల్లో శిక్షణ పొందినప్పటికీ..నృత్యంలో విశేష ప్రతిభ కనబరుస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 500వరకు ప్రదర్శనలు ఇచ్చింది.
అవార్డులే అవార్డులు
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డు, మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, సౌత్ ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో సైతం తన పేరు నమోదు చేసుకుంది. అలాగే నాట్య కుసుమల ప్రతిభా పురస్కారం, స్వామి వివేకానంద కళా పురస్కారం, గరుడ కీర్తి పురస్కారం, నృత్య ప్రతిభా పురస్కారం, ఉగాది నృత్య ప్రభా పురస్కారం వంటి అనేక అవార్డులు అందుకుంది. వీటితో పాటు శివనంది, నాట్య కిన్నెర, నాట్య సాదక్, కీర్తి కిరణం, నాట్య కౌముది, భారత కళా తిలక్, నాట్య త్రిపుర, ఇందిరా ప్రియదర్శిని, నాట్య మయూరి, నాట్య కళా మయూరి, టాటెంట్ ఐకాన్, నాట్య శిరోమణి, శ్రీనాదంగి, నృత్య విపంచి అవార్డులు అందుకుంది. రామ్ చరణ్ ట్రోఫీ, స్పెషల్ జ్యూరీ అవార్డు, మిలాన్–2023, 2024లలో ప్రతిభ చాటుకుంది. ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ శత జయింతి ఉత్సావాలలో పద్మశ్రీ చిరంజీవి చేతులు మీదుగా ప్రత్యేక సత్కారం అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment