లండన్ మిషన్ చర్చి @ 219
1805లో విశాఖపట్నం వచ్చిన లండన్ మిషన్ సొసైటీ(ఎల్‌ఎంఎస్) మిషనరీలు.. మిషన్ హౌస్‌ను తమ స్థావరంగా చేసుకున్నాయి. అందులో 1809 ఫిబ్రవరి 12న తెలుగులో మొదటి ఆదివారపు ప్రార్థన జరిగింది. ఈ విధంగా ఆరాధనలు కొనసాగుతుండగా 25 ఏళ్ల తర్వాత రెవరెండ్ జె.డబ్ల్యూ.గార్డన్ రెండు ప్రార్థనా మందిరాల నిర్మాణానికి పూనుకున్నారు. వాటిలో ఒకటి వన్‌టౌన్‌లోని ప్రస్తుత ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి కాగా.. రెండవది మెయిన్‌రోడ్డులోని ఎల్‌ఎంఎస్ ఆలయం. తర్వాత పరిణామాలతో ఎల్‌ఎంఎస్ చర్చిని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్‌ఐ) ఆలయంగా కొనసాగిస్తూ, నిర్వహణ బాధ్యతలను అప్పటి స్థానిక సంఘానికి అప్పగించారు. దక్షిణ భారతదేశంలోని ఎల్‌ఎంఎస్ సంఘాలు సౌత్ ఇండియా యునైటెడ్ చర్చ్‌గా(ఎస్‌ఐయూసీ) రూపాంతరం చెందినప్పుడు ఈ సంఘం కూడా ఎస్‌ఐయూసీలో విలీనమైంది. ఈ చర్చిలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల రచయిత రెవరెండ్ పులిపాక జగన్నాథం 37 ఏళ్ల పాటు గురువుగా సేవలందించారు. కవిసామ్రాట్ పురుషోత్తమ చౌదరి ఎల్‌ఎంఎస్ సంఘాలతో అనుబంధం కలిగి పరిచర్య చేశారు. ప్రస్తుతం ఈ చర్చికి విన్సెంట్ రాజ్‌కుమార్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment