రచయిత ఎంవీవీ ఇక లేరు
సీతంపేట: ప్రముఖ రచయిత ఎం.వి.వి.సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం మర్రిపాలెంలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయనకు భార్య సత్యవతి, కుమార్తెలు శిరీష, సౌజన్య ఉన్నారు. చందమామ పత్రికలో కథలు, నవలలు రాసి గొప్ప రచయితగా పేరు పొందారు. బాల సాహిత్యం, ప్రౌఢ సాహిత్యం, అపరాధ పరిశోధక సాహిత్యం, అనువాద సాహిత్యంపై ఆయన విశేష కృషి చేశారు. ఆయన పెద్దాపురంలో జన్మించినప్పటికీ, ఉద్యోగ రీత్యా(ఏయూ) విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఆయన పార్థివ దేహాన్ని కేజీహెచ్‌కు కుటుంబ సభ్యులు దానం చేశారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment