ముగిసిన సంబరాలు
విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నాలుగు రోజుల పాటు జరిగిన జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాలు బుధవారంతో ముగిశాయి. పట్టణంలో పల్లె వాతావరణాన్ని తలపించేలా మైదానంలో చేసిన ఏర్పాట్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చివరి రోజు నగరవాసులు భారీగా తరలివచ్చి హరిదాసులు, బసవన్నలు, పల్లె నివాసాల వద్ద ఫొటోలు దిగారు. నాలుగు రోజుల పాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు జీవీఎల్ ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కోలాటం పోటీల్లో మధురవాడ శ్రీ లక్ష్మీనరసింహ కోలాట బృందం ప్రథమ బహుమతి గెలుచుకుంది. బృందం గురువు సిరిపురపు సంతోషికి రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఐడీబీఐ ఏజీఎం నరేష్ బహుమతి అందజేశారు. సంబరాలు ముగింపు సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం ఈశ్వరాభిషేకం జరిపించారు. అనంతరం అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణాహుతి హోమం నిర్వహించారు. జీవీఎల్, మైథిలి దంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు కారుణ్య బృందం తమ గాన మాధుర్యంతో ఆహూతులను ఉర్రూతలూగించింది.
పోటెత్తిన నగర ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment