అశోక్‌నగర్‌ స్టేషన్‌లో ప్రయోగాత్మక హాల్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అశోక్‌నగర్‌ స్టేషన్‌లో ప్రయోగాత్మక హాల్ట్‌

Published Tue, Jan 21 2025 12:56 AM | Last Updated on Tue, Jan 21 2025 12:56 AM

-

తాటిచెట్లపాలెం: వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, భోపాల్‌ డివిజన్‌ పరిధిలోని అశోక్‌నగర్‌ స్టేషన్‌లో విశాఖ–భగత్‌కికోటి–విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయోగాత్మక హాల్ట్‌ ఇస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌, సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సందీప్‌ తెలిపారు. విశాఖ–భగత్‌కి కోటి (18573) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు జూలై 15వ తేదీ వరకు హాల్ట్‌ అశోక్‌నగర్‌లో హాల్ట్‌ కల్పిస్తున్నామన్నారు. ఈ రైలు ఆయా రోజుల్లో తెల్లవారు 4.28 గంటలకు అశోక్‌నగర్‌ చేరుకుని, అక్కడ నుంచి 4.30గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో భగత్‌ కి కోటి–విశాఖ(18574) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు జూలై 10వ తేదీ వరకు హాల్ట్‌ సౌకర్యం కల్పించామన్నారు. ఈనెల 25వ తేదీన పొదనూర్‌లో బయల్దేరే పొదనూర్‌–బరౌని (06055)స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రాంచీ డివిజన్‌లో మళ్లించిన మార్గంలో వయా రూర్కెలా, సిని, చందిల్‌, మూరి, కొట్‌శిల మీదుగా నడుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement