● మూడు పార్టీల కూటమి పాలనలో మొండిచేయి...
● రైతులకు మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏం చేసిందీ అని ప్రశ్నిస్తే చెప్పడానికి ఏమీ కనిపించట్లేదు. ఖరీఫ్ సీజన్ ముగిసిపోయినా పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో దళారులు, ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టుకోవాల్సి వచ్చింది.
● తుపానులు, అకాల వర్షాలతో నష్టాల నుంచి ఊరటనిచ్చే ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. ఇక వ్యవసాయానికీ 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన హామీ కూడా ఏమైందో తెలియదు. ● రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా పేరు అయితే మార్పు చేశారే తప్ప వాటి ద్వారా సేవలను మాత్రం నీరుగార్చేలా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. ఈ సారి విత్తనాలు, ఎరువులను రైతులు బ్లాక్ మార్కెట్‌లోనే అధిక ధరకు కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. ఉచిత పంటల బీమా పథకాన్నీ అమలు చేయట్లేదు.
● ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యం రైతుసేవాకేంద్రాల ద్వారా తూతూమంత్రంగానే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా దళారుల చెంతకు చేరుతోంది. జిల్లాలో 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకూ సుమారు లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారిక గణాంకాలు మాత్రం చూపిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,300 చొప్పున ధాన్యం కొనుగోలు చేయాలి. కానీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక అచేతన విధానాన్ని ఆసరాగా చేసుకొని రూ.1,800 నుంచి రూ.1,900కు మాత్రమే దళారులు కొంటున్నారు. దీనివల్ల రైతులు ప్రతి క్వింటాకు రూ.400 నుంచి రూ.500 చొప్పున నష్టపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment