ఆటో డ్రైవర్ల ఆందోళన
లోక్ అదాలత్ పేరుతో ఆటోలపై సెక్షన్–336 కింద కేసులు పెట్టడాన్ని నిలుపుదల చేయాలని శ్రీ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్, ఏఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.అప్పలరాజురెడ్డి, నారాయణరావు మాట్లాడుతూ ఇప్పటికే ఆటోడ్రైవర్లపై ఆర్టీఓ, పోలీసుల తనిఖీల పేరుతో ప్రతిరోజూ వేలాదిరూపాయలు పెనాల్టీలు విధిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పెనాల్టీలు పడుతున్నాయన్నారు. ప్రతి మూడు నెలలకోసారి లోక్ అదాలత్ పేరుతో ట్రాఫిక్ పోలీసులతో పాటు అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 336 కేసులు పెట్టి కోర్టుకి పంపడం వలన డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే కేసులను నిలుపుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సీహెచ్ ధర్మా, బాలి సన్యాసిరావు, కంది రాము, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.
– విజయనగరం టౌన్
Comments
Please login to add a commentAdd a comment